సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : మూడు దశలలో ఎన్నికల నిర్వహణ. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్: 26 నవంబర్ 2025 గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, మూడు దశలలో ఎన్నికల నిర్వహణ జరుగుతుందని, నితిన్(27వ తేదీ గురువారం) నుంచి నామినేషన్ లను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిపిఓ కల్పన లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు మూడు దశలలో నిర్వహించడం జరుగుతుందని మొదటి విడతలో పర్వతగిరి, వర్ధన్నపేట, రాయపర్తి మూడు మండలాలలోని 91 గ్రామపంచాయతీలకు 800 వార్డు లకు ఈ నెల 27 నుండి నామినేషన్ ల స్వీకరణ ప్రారంభం అవుతుందని , తేదీ.11.12.2025 గురువారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. రెండవ దశ పోలింగ్ దుగ్గొండి, గీసుగొండ, నల్లబెల్లి, సంగెo నాలుగు మండలాలలోని 117 గ్రామపంచాయతీలకు , 1008 వార్డ్ లకు, తేదీ.30.11.2025 ఆదివారం నామినేషన్ ల స్వీకరణ ప్రారంభం అవుతుందని , తేదీ.14.12.2025 ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. మూడవ దశలో ఖనాపూర్, చెన్నారవుపేట, నర్సంపేట, నెక్కొండ మండలాలలోని 109 గ్రామపంచాయతీలకు , 946 వార్డ్ లకు తేదీ.03.12.2025 బుధవారం రోజున నామినేషన్ ల స్వీకరణ ప్రారంభం అవుతుందని తేదీ.17.12.2025 బుధవారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ప్రతి మండలంలో క్లస్టర్ లను ఏర్పాటు చేశామని నామినేషన్ దాఖలాలు చేసే అభ్యర్థులు వారి క్లస్టర్ లో సూచించిన గ్రామపంచాయతీలలో నామినేషన్ సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఓటింగ్ ప్రక్రియ వెబ్ కాస్టింగ్ వీడియోగ్రఫీ ద్వారా రికార్డ్ చేయడం జరుగుతుందని అన్నారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను పరిశీలించడానికి వ్యయ పరిశీలకులను కూడా సిద్ధం చేశామని , సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులు 5 వేల జనాభా కు పైగా ఉన్న గ్రామాలలో సర్పంచ్ అభ్యర్ధి 2 లక్షల 50 వేల రూపాయల వరకు వార్డ్ సభ్యులకు 50 వేల రూపాయలు, 5 వేల జనాభా తక్కువగా ఉన్న గ్రామాలలో ఒక లక్ష 50 వేల రూపాయలు వార్డ్ సభ్యులు 30 వేలవరకు ఖర్చు చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రతి మండలంలో ఎఫ్ ఎస్ టి, జిల్లా సరిహద్దుల్లో ఎస్ ఎస్ టి చెక్ పోస్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ లకు, ఎస్ సి పి సి సర్వే 2024 డాటా ప్రకారం బీసీలకు ఇతరులకు డెడికేషన్ కమిటీ 46 జీవో నెంబర్ ను అనుసరించి రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని అన్నారు. ఎన్నికల అభ్యర్థులకు ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా కేంద్రంలో , స్థానిక ఎంపీడీవో కార్యాలయాలలో హెల్ప్ లైన్ డెస్క్ లను ఏర్పాటు చేశామని వీటి ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. డిసిపి అంకిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో సర్పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి ఆయుబ్ అలీ, ఆర్డీఓ ఉమారాణి ఆదనవు పీఆర్ ఓ ప్రేమలత, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు
-----------------------
Reporter