సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : 18 వ వార్డు మహిళా మణులు హైమావతి ఆధ్వర్యంలో పొంగులేటి క్యాంప్ ఆఫీసులో రాఖీ పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ పండుగలో మహిళా మణులు అందరూ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాఖీ కట్టి, స్వీట్ తినిపించి దీవెనలు తీసుకున్నారు. క్యాంప్ ఆఫీస్ ఆవరణ మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. రాఖీ కట్టిన 18 వ వార్డు మహిళలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహుమతులు అందజేశారు. రాఖీ పండుగ సోదరి, సోదరునికి మధ్య మనసులో ప్రేమానురాగాలు బలపడే పండుగని, తన సోదరునికి ఆయుష్షు కోరుకుంటూ రాఖీ కడతారని, మహిళలందరికీ తోబొట్టుల ఎల్లప్పుడు వెంట ఉంటానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు నాగ సీతారాములు, ఊకంటి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin