సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు మండలం జాన్పహాడ్ ఎస్బిఐ బ్యాంకు లో రైతుల అకౌంట్లు హోల్డ్ చేసి రైతుబంధు నగదు ను రైతులకు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని బహుజన సమాజ్ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి బోలగాని సుబ్బుగౌడ్ అన్నారు. సోమవారం నాడు ఆయన పాలకవీడు మండల కేంద్రము లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు పధకాన్ని ప్రవేశ పెట్టారు. కాని బ్యాంకర్లు ఆ నగదును మీ పంట రుణం రుణమాఫీ కాలేదు అని రుణం పూర్తిగా చెల్లిస్తేగానీ రైతు బంధు నగదు చెల్లించము అని రైతు బంధు నగదు ను హోల్డు లో పెట్టి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని అంటున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతే రాజు అని మా ప్రభుత్వం లో రైతులకుపెద్ద పీట వేసాము అంటూ గొప్పలు చెప్పుకుంటూ పోతుంది తప్ప రైతులను పట్టించుకోవడం లేదని రైతు బంధు నగదు కి రుణమాఫీ నగదు కి సంభందం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పి నా బ్యాంకు వారు లెక్కచేయక పోవడం విడ్డూరంగా ఉందని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల మీద కపట ప్రేమ తప్ప వారి సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా రైతుబంధు నగదు కి రుణమాఫీకి సంభందం లేకుండా రైతు బంధు నగదు రైతులకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
-----------------------
Admin