Sunday, 26 July 2026 02:01:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణలో బీసీలకు 23 సీట్లేనా..! ఇదేం న్యాయం..?

Date : 24 August 2023 02:08 AM Views : 384

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: బిజెపి కార్యాలయంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశం లో బిజెపి ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఆకుల నాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే మన బ్రతుకులు బాగుపడతాయని ఎన్నో త్యాగాలను చేసి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు గడీల పాలనయింది. తెలంగాణలో మెజార్టీ పీపులైన బీసీలకు కనీసం 50% బి ఆర్ సి పార్టీ ఇయ్యకుండా బీసీలకు 23 సీట్లు ఇచ్చి, 10 శాతం ఉన్న అగ్ర కులాలకు 50% సీట్లు ఇచ్చి 60 శాతం ఉన్న బీసీలకు 20 శాతం టికెట్లు ఇచ్చి దగా చేసిన కేసీఆర్ ఈనాడు తెలంగాణలో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు. మెజార్టీ వర్గాలకు రాజ్యాధికారం ఫలాలు దక్కకుండా ఒకటి రెండు శాతం ఉన్న వర్గాలకు రాజ్యాధికార ఫలాలు ఈ తొమ్మిది ఏళ్లలో వారికే దక్కాయి. ఏదైతే తెలంగాణ తెచ్చుకున్నాము త్యాగం చేసిన బీసీ .ఎస్సీ .ఎస్టీ వర్గాలను తుంగలో తొక్కి మళ్ళీ మూడోసారి రావాలనే ప్రయత్నం బీసీలు గుర్తించి నిన్ను ఓటు బ్యాంకు ద్వారా ఇంటికి పంపడం ఖాయం. ఏ వర్గాలకు న్యాయం చేయకపోగా పథకాలతో , గా రడీలతో ఓటు వేయించుకోవాలని చూస్తున్న ఈ ప్రభుత్వం నమ్మే పరిస్థితిలో బీసీలు లేరని, ఈనాడు తెలంగాణలో బిజెపి పార్టీ ద్వారా బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందని, నరేంద్ర మోడీ గారు సారథ్యంలో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీసీలను అగ్ర తాంబూలం ఇచ్చి బిజెపి పార్టీ లో మోడీ గారి ప్రధానమంత్రి అయ్యారని రానున్న రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం పతనం కాయం. బీసీ బందు అన్ని వర్గాలకు కేటాయించాలని డిమాండ్ రానున్న రోజుల్లో బీసీలు మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలియపరిచారు.అట్టడుగు వర్గాలను మోసం చేసి తెలంగాణలో ప్రభుత్వం నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో obc జిల్లా ప్రధాన కార్యదర్శి కేసు గాని శ్రీనివాస్ గౌడ్, భూపతి అప్పారావు, టీ. నరేంద్రబాబు,జలారపు శ్రీనివాస్, ఉబ్బనపల్లి వినీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :