Monday, 27 July 2026 05:09:00 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి... - జిల్లా కలెక్టర్ ప్రియాంక అల

Date : 24 February 2024 08:19 AM Views : 285

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అల అన్నారు. శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్ర ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలో కలియ తిరుగుతూ వార్డులు పరిశీలించి రోగులతో మాట్లాడారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో తొలుత ఎమర్జెన్సీ వార్డును సందర్శించారు. అక్కడి రోగులతో మాట్లాడారు వైద్య సేవలు సరిగ్గా అందుతున్నాయా మందులు ఇస్తున్నారా ఎన్ని రోజులు నుండి ఆసుపత్రిలో ఉన్నారు ఇలాంటి తదితరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉంటూ రోగులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వైద్య చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రులకు పేదవారు వస్తారని, మెరుగైన సేవలు అందించాలని అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని, వీటిని ప్రజలు వినియోగించుకొనేలా చూడాలని, ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా అవగాహన కల్పించాలని  కలెక్టర్ అన్నారు. అనంతరం ఆర్థోపెడిక్ వార్డ్, ఇంటెన్సివ్ కేర్ ను సందర్శించి అక్కడ రోగుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెడికల్ స్టోర్, లేబర్ రూములు, ఆపరేషన్ థియేటర్లను  పరిశీలించారు.సిబ్బంది యొక్క హాజరు బయోమెట్రిక్ రికార్డులను పరిశీలించిన ఆమె అలసత్వం వహించిన వైద్యులు, సిబ్బంది పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు, సిబ్బంది  హాజరు బయోమెట్రిక్ విధానంలో నూరు శాతం ఉండాలని ఆసుపత్రి సూపర్డెంట్ ను ఆదేశించారు. ఆసుపత్రి అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగినవి ఇంకా ఎంతవరకు జరగాల్సినవి సంబంధిత రికార్డులు పరిశీలించారు. ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వర్లు తో  ఆసుపత్రి వెలుపల డ్రైనేజీ నిర్మాణం కు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు  కావలసిన ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. వారం రోజుల్లో ఆస్పత్రిలో ఉన్న పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఆస్పత్రి ఏ ఓ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ శిరీష, ఆసుపత్రి ఇంచార్జి సూపర్డెంట్ లక్ష్మణరావు, ఆర్ఎంఓ జిజిహెచ్ డాక్టర్  పుష్పలత, ఆర్ ఎం ఓ ఎం సి హెచ్ రామవరం  డాక్టర్ వీరబాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సురేందర్ ఆస్పత్రి అన్ని విభాగాల మెడికల్ ఆఫీసర్లు సిబ్బంది పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: