సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల పరిధిలోని మహమ్మదా బాద్ క్రాస్ లో సర్వే నెంబర్ 70లో ప్రభుత్వ భూమిని గ్రామ సంఘానికి సోమవారం తాహసిల్దార్ శ్రీధర్ పట్టా మంజూరు చేశారు. మహిళా సంఘాలు అభ్యున్నతికి తోడ్పాటు అందించిన తాసిల్దార్ శ్రీధర్ ని గ్రామైక సంఘ సభ్యులు మహిళలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ నాగేంద్ర, విఆర్వోలు నరసింహులు, లోకేశ్వరి, మహిళా మండలి గ్రామ సంఘం అధ్యక్షులు మంగమ్మ ,సభ్యురాలు వరలక్ష్మి అరుణ ,నరసమ్మ ,వివో జయచంద్ర రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin