సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : సింగరేణి సింగరేణి ఏరియాలో దీర్ఘకాలికంగా విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ అధికారి రమణా రెడ్డిని బదిలీ చేయాలని,అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపడుతున్న ఏజెన్సీ పై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ జోనల్ ఇంచార్జ్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. గురువారం పార్టీ శ్రేణులతో కలిసి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ సింగరేణి నియమ నిబంధనల ప్రకారం కీలకమైన ఏరియా సెక్యూరిటీ అధికారిగా కొనసాగుతున్న వారిని నిర్దేశించిన కాలపరిమితి అయిపోగానే బదిలీ చేయకపోవడం వల్ల ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ వారితో కలిసి నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. అదేవిధంగా నిబందనలకు విరుద్ధంగా నియామకాలు చేపడుతున్న సాయిరాం సెక్యూరిటీ ఏజెన్సీ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, సెక్యూరిటీ అధికారి అండదండలతో ఇష్టారీతిన వ్యవహరిస్తూ సెక్యూరిటీ గార్డులను ఇబ్బందులకు గురిచేస్తున్న సూపర్ వైజర్ సుంకరి శ్రీనును తొలగించి అనుభవం ఉన్న మాజీ సైనికులను సూపర్ వైజర్లుగా నియమించాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షుడు చేనిగారపు నిరంజన్ కుమార్,కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి,మాలోత్ వీరు నాయక్,అల్లకొండ శరత్,సందీప్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin