సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : కాజీపేట మండలం టేకులగూడెం గ్రామంలోని " పునీత్ ఆంథోని దేవాలయం" వారు గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సమస్త జనుల కోసం దేవుని చేత మనుషులకు మధ్య పంపబడినటువంటి పవిత్రమైనటువంటి ఏకైక వ్యక్తి మనుషుల కోసం సిలువలో మరణం పొందినటువంటి వ్యక్తి "ఏసుక్రీస్తు" అని తెలియజేస్తూ గుడ్ ఫ్రైడే రోజు జ్ఞాపకం చేసుకుంటూ సిలువ మార్గాన్ని టేకులగూడెంలోని పూర్వ వీధుల్లో ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో విచారణ గురువు " ఫాదర్ "బాలస్వామి , పంతులు.( దాస్) చంద్రమౌళి, గార్ల ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు వేషధారంలో సింగారపు .క్రిస్టోఫర్ , సంఘ పెద్దలు, కదిరే.జాన్, మాతంగి. పౌలు, కందికే .ఆరోగ్యం, మాచర్ల .కుమారస్వామి, గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఏసుక్రీస్తు మరణం విషయం తెలియజేస్తూ ప్రదర్శించారు....
-----------------------
Admin