సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : జిల్లా ప్రతినిధి రజనీకాంత్, వారసత్వ వీఆర్ఏల కు వెంటనే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి.... సిఐటియు జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్, సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నాకు సిఐటియు జిల్లా కన్వీనర్ కే చంద్రశేఖర్ మద్దతు తెలుపుతూ మాట్లాడారు వీఆర్ఏల వారసులకు జీవో నెంబర్ 81 ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వారికి పిల్లలకు వారి కుటుంబ ఆ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు వీఆర్ఏలకు అనేక అనేక ఇబ్బందులు ఉన్నాయని అన్నారు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు కల్పించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా కాకుండా కార్మిక కర్షక రైతు ప్రభుత్వంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అన్నారు కార్మికుల సమస్యల సమీలను పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు జాదవ్ దేవయ్య అశోక్ పండరి రాజేందర్ హనుమాన్లు వేణు ఉదయ్ శివ శంకర్ భూమయ్య రాములు పాల్గొన్నారు...
-----------------------
Admin