సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హనుమకొండ నగరంలోని పెగడపల్లి డబ్బాలు జంక్షన్ లో నిజాయితీకి ప్రతి కథ ఇద్దరు విద్యార్థులు నిలిచారు. ఏకశిలా ఉన్నత పాఠశాలలో చదువుతున్న పూజిత, లిథివిక్ అనే బాల బాలికలు తాము బడికి వెళ్లే ప్రాంతము లోని రహదారిపై 400 రూపాయలు నగదును గుర్తించారు.ఆ మొత్తాన్ని ఏమాత్రం ఆలోచించకుండా అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రమేష్ ,గంగాధర్ కు అప్పగించారు. డబ్బు చిన్నదైనా, పెద్దదైన నిజాయితీగా ఉండడమే ముఖ్యమని గుర్తించిన విద్యార్థుల ధర్మాన్ని కానిస్టేబుల్ అభినందించారు. విద్యార్థులు అప్పగించిన సొమ్మును పోలీస్ స్టేషన్ లో జమ చేస్తానని ఆయన తెలిపారు. విద్యార్థులు పూజిత, లిథివిక్ ల నిజాయితీని అందరూ ప్రశంసిస్తున్నారు.
-----------------------
Reporter