సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : మధిర చర్చిలో లోకబాంధవుడిగా కీర్తిగాంచి విశ్వ మానవాళికి ప్రేమతత్వంతో వెలుగులు పంచిన కరుణామయుడు... ఏసుక్రీస్తు అవతరించిన పవిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పండుగ చేసుకుంటున్న క్రైస్తవ సోదర, సోదరీమణులకు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు అన్నారు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారు. ప్రపంచానికి త్యాగం, శాంతి, ప్రేమ సందేశాలను ఆచరణాత్మకంగా అందించిన ఆ ప్రభువు పలుకులు ఆచరణీయం. ఈర్ష్యాద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు, ద్రోహచింతన విడనాడాలన్న క్రీస్తు వాక్యము శ్రేయోదాయకం. ప్రజలందరికీ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ఉండాలని, అంతులేని ఆనందాన్ని, సంపదను ప్రసాదించాలని ఏసుక్రీస్తును ప్రార్ధిస్తున్నాను.
-----------------------
Admin