సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : నిజాంబాద్ జిల్లా లోని ఆర్మూర్, భీంగల్, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్, ఎర్గట్ల, పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేసిన నిజాంబాద్ పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ ఐ.పి.యస్ మొట్టమొదలు పోలీస్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించి, పోలీస్ స్టేషన్ లోని అన్ని ప్రదేశాలకు తిరిగి పరిశుభ్రత ఎలా ఉందనే విషయం తెలుసుకున్నారు. అనంతం రిసిప్షన్ కౌంటర్లకు వెళ్లారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదు దారుడికి ఎలా గౌరవిస్తారు..? వారి ఇబ్బందిని ఎలా తెలుసుకుంటార..? ప్రతీ ఫిర్యాదుకు అంతర్జాలంలో నమోదు చేయాలని అనంతరం పోలీస్ స్టేషన్లో 5 ఎస్ విధానం అమలు కోసం తీసుకుంటున్న చర్యలు క్షుణంగా చూశారు. పోలీస్ స్టేషన్ లోని రికార్డులను క్షుణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ త్వరలో వినాయక చవితి, మిలాద్ - ఉన్- నబీ పండగల సందర్భంగా పటిష్ట బందోబస్ చర్యలు తీసుకోవాలని ఎలాంటి సమస్యలు రాకుండా నిఘా వ్యవస్థను పటిష్ట పర్చాలని ప్రజలతో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, వారి ఫిర్యాదులకు త్వరగా పరిష్కరించుటకు తగు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అనంతరం సిబ్బంది సాధకబాధలు తెలుసుకొని వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో నిజాంబాద్ ఆర్మూర్ ఎ సి పి ఎం . జగదీష్ చందర్, భీంగల్ సీ.ఐ వెంకటేశ్వర్లు ఆర్మూరు రూరల్ సీ.ఐ గోవర్ధన్ రెడ్డి, ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సురేష్ బాబు, ఆర్మూర్, భీంగల్, కమ్మర్పల్లి, ఎర్గ ట్ల,వేల్పూర్, మోర్తాడ్, పోలీస్ స్టేషన్ల ఎస్సైలు అనిల్ రెడ్డి, రాజశేఖర్, మచ్చిందర్ రెడ్డి, హరిబాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Admin