సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : అదిలాబాద్ : ప్రజల మన్నలను పొందుతూ పార్టీలకతీతంగా కృషి చేస్తుంటే ఓర్వలేక కంది శ్రీనివాస్ రెడ్డి బురద రాజకీయాలు చేస్తున్నాడని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అన్నారు లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజలు విశ్వసించరని నీ గురించి నీ వ్యవహార శైలి నచ్చకనే ప్రజలు నిన్ను తిరస్కరించారని ఆయన అన్నారు 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నానని ప్రజలకు జవాబుదారీగా ఉన్న నాయకులు హుందాగా వ్యవహరించాలని ఆయన అన్నారు అదిలాబాద్ లో నా ఇల్లు తప్ప అన్ని భూములు కబ్జా చేసినట్లుగా ఆరోపించారంటేనే అందులో ఎంత నిజముందో అర్థం అవుతుందని ఆయన అన్నారు అక్రమంగా ఆస్తులు కూడా పెట్టుకున్నారని అనడంలో అర్థం లేదని కష్టపడి ఆస్తులు సంపాదించుకోవడం కూడా తప్పేనా అని ఆయన ప్రశ్నించారు ఎన్నికల సమయంలో జోగు రామన్న నేను ఒకటే అని దుష్ప్రచారం చేసిన ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించారని ఆయన అన్నారు బీసీ బిడ్డగా రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేక దురుద్దేశంతో అవమానించే రీతిలో మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు అదిలాబాద్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జిల్లా మంత్రి సీతక్కను కలిస్తే తప్పేంటి వాళ్లు తనకిచ్చే గౌరవాన్ని చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు లక్షలమంది భక్తిశ్రద్ధలతో నిర్వహించిన మహా యాగాన్ని సైతం రాజకీయం చేయడం మంచిది కాదని ఆయన సూచించారు కంది చేసిన మోసాల గురించి వివిధ ఛానళ్లు ప్రసారం చేశాయి ప్రజా ప్రతినిధులు హుందాగా విలువలకు కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు సాత్నాల ఇరిగేషన్ కోసం ఉంచిన భూమిని కబ్జా చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా ఉత్తరం రాశారు. ఇరిగేషన్ కు సంబంధించిన స్థలంలో భూ కబ్జా చేశారు. మూడేళ్ళ కిందటి ఖాళీ భూమి ఉంది. అవసరమొస్తే మేము మాట్లాడే మాటలకు బయట తిరగలేరు. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా వెనకబడే ఉండాలన్న ఉద్దేశంతో. అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయని కూడా ఆరోపించారు. హై కోర్ట్ లో కేసు ఉండే. నేను ఎక్కడైనా తప్పు చేసినట్లు ఉంటే పూర్తి విచారణ జరపాలి. చీప్ జిమ్మిక్కు మాత్రమే. పదేళ్ల కిందట నాకున్న కంపెనీలలో షేర్ల గురించి అఫిడవిట్ లో రాశాము. నా చుట్టుపక్కల ఉన్నవారికి భూములు ఉండొద్దా అని ప్రశ్నించారు. పత్రిక మిత్రులకు స్థలాలు ఇవ్వడం తప్పా... చచ్చినా బతికినా బీజేపీ పార్టీలో ఉంటానని ప్రగల్భాలు పలికి ఏడాదిలోనే పార్టీ మారారు. రాజకీయంగా బురద జల్లాలన్న ఉద్దేశ్యంతో. పదవ తరగతి మాత్రమే ఉన్నాను అని నేను. డిగ్రీ పరీక్షలు రాస్తేనే సర్టిఫికెట్ వచ్చింది. మంత్రి అయ్యాక సీతక్క llb పరీక్ష రాశారు. ఆమెది కూడా తప్పేనా. మేము మాత్రమే రాజకీయాలు చేయాలని చూస్తే చరిత్ర క్షమించదు. సామాన్య కుటుంబం నుండి వచ్చాను.... ముఖ్యమంత్రి మాట్లాడినా ఓర్వలేక పోతున్నారు. రాజకీయాల్లో హుందాగా ఉండాలని నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకుని హెచ్చరించారు... కార్యక్రమంలో పార్టీ నాయకులు. జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందం నాయకులు ఆదినాద్. నగేష్ రత్నాకర్ రెడ్డి రమేష్ వేణుగోపాల్. లాలా మున్నా ఆకుల ప్రవీణ్ .సోమరవి. జోగు రవి రాజేష్ రఘుపతి శ్రీనివాస్ సుభాష్ దయాకర్. రాష్ట్ర పాల్ బోయర్ విజయ్ భీమ్చంద్ రెడ్డి రవి రెడ్డి వేద వ్యాస్ మహేందర్.. తదితరులు ఉన్నారు
-----------------------
Admin