Monday, 27 July 2026 12:47:24 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీ... - బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు

Date : 26 July 2024 11:35 AM Views : 325

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మంత్రి బట్టి విక్రమార్క నేడు ప్రకటించిన బడ్జెట్ .. పేరు గొప్ప ఊరు దిబ్బ మాదిరిగా ఉంది తెలంగాణ బడ్జెట్ 70 పేజీల పుస్తకంలో 70 అబద్ధాలు. చేతగానమ్మకు మాటలు ఎక్కువ అని భట్టి చెప్పిన మాటలు ఆయనకే వర్తించినట్లు కనపడింది. చెప్పుకోవడానికి రూ.2,91,159కోట్లతో బడ్జెట్‌. ఖర్చేమో రూ.2,20,000 వేల కోట్లు. పెట్టుబడి వ్యయం రూ. 33 వేల కోట్లు. ఇది రాష్ట్ర అభివృద్ధిని కుంటుపర్చే బడ్జెట్, అభివృద్ధికి తిరోగమనమయ్యే బడ్జెట్. రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే బడ్జెట్. అభివృద్ధి కుంటుపడితే వచ్చే తరాలు నష్టపోతాయన్న కనీస పరిజ్నానం లేని ఈ ప్రభుత్వం పెట్టుబడులకు తక్కువ ఖర్చు చేయడం దురదృష్టకరం. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంలో సింహభాగం ఎక్సైజ్, పెట్రోల్, డీజిల్ పై వ్యాటే ఎక్కువ. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, సహకార సంఘాల నుంచి వచ్చే నిధులే రూ. 70 వేల కోట్ల పైనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆదాయమేది..? కొత్తగా చేయబోయే అప్పులు రూ. 71,000 కోట్లు. ఇది గత ప్రభుత్వానికి ఏమాత్రం భిన్నంగా లేదు. రైతుల తలరాత మార్చే బడ్జెట్ కాదు.. రైతులను నడియేట్లో ముంచే బడ్జెట్. బడ్జెట్ లో వ్యవసాయానికి రూ.72,659 కోట్లు ప్రకటించారు.. అందులో రుణమాఫీకే సింహభాగం. మరి.. రైతుభరోసా ఎక్కడ..? కౌలు రైతులు, రైతుల కూలీల సంక్షేమం ఎక్కడ..? నిధులేవి..? ఫసల్ బీమా యోజన ఏది..? రైతు బీమా ఏది..? ఇతర వ్యవసాయ సబ్సిడీలు ఏవి..? వ్యవసాయ అనుబంధ రంగాలకు సబ్సిడీలేవి..? రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే సరైన లెక్కల్లేవు. మొత్తం బడ్జెట్ లో మీరు చూపించిన లెక్క ప్రకారమే రూ. 60 వేల కోట్లకు పైగా అప్పులకే పోతున్నాయి. అప్పులు కట్టడం కోసమే అప్పులు చేస్తున్న ప్రభుత్వమిది. వడ్డీ లేని పంట రుణాల నిధులు కేటాయించలేదు..? ఎందుకు..?బడ్జెట్ లో రైతు కూలీలు, కౌలు రైతుల సంక్షేమానికి ఎక్కడ కేటాయింపుల్లేవు.. కాని, దీనిపై మాత్రం గొప్పలు చెప్పుకున్నారు. మీ మాటలు కోటలు దాటుతున్నాయి.. మీ లెక్కలు మాత్రం చేతల్లో అసెంబ్లీ గేటు దాటడం లేదు. ఫైనాన్స్ మినిస్టర్ ప్రజెంటేషన్ ఆసక్తికరంగా ఉంది.. భాష బాగుంది. మసాలా బాగుంది. అంతా అంకెల డొల్ల. అంబేద్కర్ పేరు, పూలే పేర్లతో పాటు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, గాంధీ కుటుంబాన్ని పొగడటానికే బడ్జెట్ పుస్తకం వినసొంపుగా చదివినట్లుంది. గృహ నిర్మాణంలో మీరిచ్చిన వాగ్ధానం ప్రకారం రూ. 24 వేల కోట్లు అవసరం. మరి అందుకు ఎంతిస్తారో లెక్కజెప్పలే.. రీజినల్ రింగురోడ్డు కోసం మొత్తం నిధులు భూసేకరణలో సగం.. నిర్మాణంలో మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నపుడు బడ్జెట్ ప్రసంగంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నట్లుగా ప్రకటించుకోవడం హాస్యాస్పదం. తబ్లికీ జమాత్ సంస్థకు రూ. 2.04 కోట్ల నిధులు కేటాయించడం సెక్యులర్ రాజ్యాంగానికి విరుద్ధం. ఒక మతోన్మాద సంస్థకు నిధులు ఇవ్వడమంటే ఒక వర్గం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక ప్రేమ కనపడుతోంది. రంజాన్ పండుగకు తోఫాలు.. మరి హిందూ పండుగలకు కేటాయింపులేవి..? సాగునీటికి రూ. 26 వేల కోట్లు ఇచ్చామంటున్నరు.. పాలమూరు -రంగారెడ్డి, డిండి, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎంత ఇచ్చారు..? నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు గాని, సగం పనులతో ఆగిపోయిన నక్కలగండికి ఎన్ని నిధులు తెచ్చారు..? ఆ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించే దమ్ములేదా..?రోడ్లు, భవనాల శాఖమంత్రిగా ఉన్న కోమటి రెడ్డి నల్గొండ జిల్లా సంగతేంటి.. ఎన్నివేల కోట్లు కేటాయించినవ్..పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులతో పాటు నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులకు నిధులేవి..? గోదావరి నదిపై ప్రాజెక్టుల సంగతేంటి..? బడ్జెట్ లో ఆరోగ్య శ్రీ కి నిధులు పెంచినట్లు చెప్పారు.. మరి బకాయిల చెల్లింపుపై ఎందుకు స్పష్టత ఇవ్వలేదు..?కేంద్ర బడ్జెట్ లో కొన్ని రాష్ట్రాల పేరు చెబితే ఎగిరెగిరిపడ్డ రేవంత్ రెడ్డి రాష్ట్ర బడ్జెట్ లో హైదరాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పేర్లు మాత్రమే చెప్పిన్రు.. మరి మిగతా జిల్లాల సంగతేంటి. అని ప్రశ్నించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :