సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట రూరల్ మండల BRS పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ యొక్క సమావేశంలో మండల ఇన్చార్జి నామాల సత్యనారాయణ మరియు మండల కన్వీనర్ కొమళ్ల గోపాల్ రెడ్డి గార్లు మాట్లాడుతూ గత సిజన్ లో ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి కి ఇంకా బోనస్ ఇవ్వకుండా రైతులకు మోసం చేస్తున్నారని వెంటనే రైతులకు బాకీ ఉన్న బోనస్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.రైతులకు ప్రభుత్వం బోనస్ ఇస్తాం అంటె నమ్మి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు విక్రయించారు అని రైతుల నమ్మకాన్ని వమ్ము చేయకుండ బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మోతే జై పాల్ రెడ్డి,ఈర్ల నర్సింహరములు,కట్ల సుదర్శన్ రెడ్డి,మాంచిక నర్సయ్య,తాళ్ళపెళ్లి రాం ప్రసాద్,బండారి రమేష్,మోటురీ రవి,కోడారీ రవి,కాడారీ కుమారస్వామి,అల్లి రవి,దూడల ప్రకాశ్ తదితరులు ఉన్నారు.
-----------------------
Reporter