సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలంలోని చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఉపాధ్యక్షుడు చిడెం సాయి తేజ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా భద్రాచలం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి 20 యూనిట్ల రక్తం ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వెంకటాపురం వైస్ ఎంపీపీ మరియు కాంగ్రెస్ మండల అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ పాల్గొని రక్త దానం చేసిన వారందరికీ సర్టిఫికెట్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. జన్మదిన సందర్భంగా చేయూత ఫౌండేషన్ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్ ఉపాధ్యక్షుడు చిడెం సాయి తేజ పెరకవీధి యూత్ రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్ రావుల నాని గుండమల్ల మధు శ్రీనాథ్ చిట్టెం టాకయ్య వుచిడెం ముత్తయ్య సొసైటి మెంబర్ బత్తుల రేణుకా మాజీ సర్పంచ్ దేవరకొండ ధనలక్ష్మి పల్నాటి ప్రవీణ్ చిట్టెం సాయి రాచకొండ రాము కొప్పుల వినోద్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin