సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న బిసిల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ డిమాండ్ చేశారు. ఆదివారం షాద్ నగర్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఫరుక్ నగర్ మండల బీసీ కమిటీని శంకర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాలూకా బీసీ సెల్ కన్వీనర్ జాకారం చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో ఈ కమిటీని ఎన్నుకున్నట్టు ఆయన ప్రకటించారు. మండల కమిటీ అధ్యక్షుడిగా బసప్ప ఉపాధ్యక్షుడిగా ముకుందం, జగన్నాథం, సత్యం, పూజారి రాములు, ప్రధాన కార్యదర్శిగా అంజయ్య, కార్యదర్శులుగా ఆవ యాదయ్య, రవికుమార్, శివశంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా చంద్రకాంత్, కోశాధికారిగా బాలరాజ్, యాదయ్య, సలహాదారులుగా గున్న వెంకటేష్, భూపాల్ యాదవ్, కుమ్మరి చిన్న రాములు, సింగారం యాదయ్య, చెన్నయ్య రాజులను ఎన్నుకున్నట్టు స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను అడుగడుగున అన్యాయం చేస్తుందని అన్నారు. చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించటంతో పాటు కేంద్రంలో ప్రత్యేకంగా బిసి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా.. బిసిలకు కూడా ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని విన్నవించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా బీసీలకు అడగడుగున అన్యాయం చేస్తుందని బిసి బంధు కింద అన్ని వర్గాలకు ఒక లక్ష రూపాయలు ఇవ్వకుండా కేవలం బీసీల్లో కొందరికి మాత్రమె లక్ష రూపాయల బందు ఇస్తున్నారని ఇది తీవ్ర అన్యాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిసిసి నెంబర్ బాబర్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జగదీష్ అప్ప, కొందుర్గు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఐఎన్టియుసి రఘు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్, నాగి సాయిలు, అందేమోహన్, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, ముబారక్ అశోక్, అదే శ్రీకాంత్, నెహ్రు నాయక్, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin