సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : అసెంబ్లీ ఎన్నికల కు అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ సమీపిస్తున్న సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐ పి ఎస్ కోదాడ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని పరిశీలించడం జరిగినది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ కోసం ఎన్నికల నియమావళి ప్రకారం బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాం, 100 మీటర్ల లోపు తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలను తీసుకోవడం జరిగినదని ఎస్పీ అన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం భద్రత ఏర్పాటు చేయాలని స్థానిక డి ఎస్ పి ని, ఎన్నికల పోలీస్ నోడల్ అధికారినీ ఆదేశించారు. పూర్తి బారికేడింగ్ ఏర్పాటు చేయాలి, ర్యాలీ, వాహనాలను 100 మీటర్ల పరిధిలోకి అనుమతించవద్దు అని తెలిపిన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థిని నింబందనల ప్రకారం కార్యాలయం లోకి అనుమతించాలని సూచించారు.ఎస్పీ వెంట అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, కోదాడ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పోలీస్ నోడల్ అధికారి డి ఎస్ పి రవి, స్థానిక డి ఎస్ పి ప్రకాష్, సి ఐ రాము, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin