Sunday, 26 July 2026 09:54:05 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఐ.కె.పి.,పి.ఏ.సి.యస్. సంఘంలో జరిగిన అవకతవకల పై విచారణ చేపట్టాలి...

Date : 30 January 2024 04:59 PM Views : 216

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఐ.కె.పి. 2020/2021వ సంవత్సరము నందు చిల్లేపల్లి పి.ఏ.సి.యస్. సంఘం నందు జరిగిన అక్రమ అవకతవకల పై సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు కు వినతి పత్రం అందజేశారు... పి.ఏ.సి.యస్. చిల్లేపల్లి సంఘం డైరెక్టర్లు మరియు సంఘ రైతులు కలిసి కలెక్టరేట్ ముందు నిరసన అనంతరం వారు మాట్లాడుతూ మా సంఘములో ఐ.కె.పి. 2020/21వ సంవత్సరములో ధాన్యం ఐ.కె.పి. ద్వారా రైతుల నుండి కొనుగోలు చేసినారు. అట్టి ధాన్యం మా సంఘ పరిధిలో ఉన్న రైతుల నుండి కొనుగోలు చేయవలసి ఉండగా సంఘ చైర్మన్ మరియు సి.ఇ.ఓ., మిల్లు యాజమాన్యం వారితో కుమ్మక్కై దాదాపుగా 1,25,772 బస్తాల ధాన్యం కొనుగోలు చేసి మా సంఘ పరిధిలోని రైతులు కాకుండా వేరే ప్రాంతం రైతుల పేర్ల పైన సంబధిత బిల్లులు తయారు చేసి సంఘచైర్మన్, సి.ఇ.ఓ.లు కలిసి సొమ్మును స్వాహా చేసినారు. ఇట్టి విషయమై మేము సంఘం యొక్క డైరెక్టర్లు,సి.ఇ.ఓ.కి అడగగా ఇట్టి విషయములో మీకు ఏలాంటి సంబంధం లేదు. మీకు ఎలాంటి నష్టం కూడా లేదు అని నిర్లక్ష్యంగా సమాదానం చెప్పడం జరిగినది. దీనిపై పేపర్లలో వార్తలు వచ్చినాయి. కానీ గతములో కూడా మార్ఫెడ్ కు చెల్లించాల్సిన నగదును చెల్లించకుండా వాడుకున్నారు. ఆ తర్వాత ఆడిటర్ వారి హెచ్చరికతో పై అధికారులు ఆదేశించగా మార్ఫైడ్లో వాడుకున్న 5 లక్షలు చెల్లించినారు. కావున మా యందు దయవుంచి కె.వి.పి.లో అమ్మిన రైతుల బ్యాంకు ఖాతాలో జమ అయిన వాటిని తిరిగి చైర్మన్, వారి బంధువుల ఖాతాలోకి వెళ్ళినవి. ఇట్టి విషయముపై సమగ్ర విచారణ విచారణ జరిపి, చైర్మన్, సి.ఇ.ఓ. లపై చట్టపరమైన చర్యలు తీసుకొనగలరని సహకార సంఘం డైరెక్టర్లము మరియు రైతులము కోరుతున్నాము. ఇట్టి దర్యాప్తుపై ఎంక్వైరీకి రాగా విషయం తెలిసి కూడా సి.ఇ.ఓ. సెలవు పెట్టినాడు. ఆ తర్వాత ఎంక్వైరీకి వచ్చిన అధికారి, చైర్మన్, సి.ఇ.ఓ. మా డైరక్టర్లకు తెలియజేయకుండా ఎక్కడో కూర్కొని తూతూ మంత్రంగా ఎంక్వైరీ చేయకుండానే చేసినట్లుగా సి.ఇ.ఓ., చైర్మన్, వచ్చిన అధికారి, అప్పటి శాసన సభ్యులు కుమ్మక్కై శాసన సభ్యుని ఆఫీస్ లో కూర్చొని వారి ఇష్టానుసారముగా చేసుకొని వెళ్ళినారు. కానీ ఇట్టి అవకతవకలకు పాల్పడిన చైర్మన్, సి.ఇ.ఓ.ల పై ఏలాంటి చర్యలు గైకొనలేదు. కావున ముందుగా వీరిని తక్షణమే పదవుల నుండి తొలగించి, వారిపై తదుపరి చర్యలు తీసుకొనగలరని కలెక్టర్కు సోమవారం అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్ వెంకట్రావు తక్షణం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: