సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యే మనుమా వెంకటేశ్వరరావు ఇంటి వద్ద రిషి అను యువకుడు ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు సమాచారం... దీనికి కారణం ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘవేంద్ర అని తెలుస్తుంది ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ దగ్గర రిషి అనే వ్యక్తి మూడేళ్లు నుండి పి ఎ గా పనిచేస్తున్నాడు తనకి తల్లిదండ్రులు లేరు. మూడు నెలలుగా జీతం డబ్బులు ఇవ్వడం లేదని ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుందని పలుమార్లు చెప్పిన రాఘవ ఈ విషయంలో ఏదో ఒక సాకు చెప్పి దాటేస్తున్నాడు. దీంతో రిషి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కి తెలియజేశారు. వీరి మాటలు వింటున్న రాఘవ కిందకు వచ్చి నాన్నగారికి ఎందుకు చెప్పావని రిషి పై కోపంతో విర్రవీగి రిషి పై చేయి చేసుకున్నాడని సమాచారం. దీంతో మనస్థాపానికి గురైన రిషి వర్మ ఇంటి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. వెంటనే గన్మెన్లు పోలీసులు అతన్ని ఆపినారు. దీంతో ఎమ్మెల్యే వనమా జోక్యం చేసుకోనీ రీషికి రాఘవతో సారీ చెప్పించారు. ఈ ఘటనపై రాఘవను వివరణ కోరగా తను లేటుగా వచ్చాడని మందలించడం వల్ల మనస్థాపాను గురయ్యాడని తెలియజేశారు. అంతేగాని ఎలాంటి ఆత్మహత్యయత్నం చేయలేదని అన్నాడు. కానీ ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో అనేక సంఘటనలు జరిగాయి బెయిల్ పైన బయటకు వచ్చిన రాఘవ పార్టీ సస్పెన్షన్ వేటు వేయడం కూడా జరిగింది...
-----------------------
Admin