Monday, 27 July 2026 06:28:09 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి... -రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

Date : 06 August 2023 06:56 AM Views : 436

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట : రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలన్నీ గుర్తు చేసుకుని సీఎం కేసీఆర్ వీలైనంత తొందరగా తమ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.ముఖ్యంగా అర్హులైన వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టు కుటుంబానికి ఇంటి స్థలం లేదా ప్రత్యేక ఇంటి నిర్మాణం చేయాలన్నారు అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో అన్ని సౌకర్యాలతో కూడిన పక్కా జర్నలిస్టు భవనాలు నియోజకవర్గ మండల కేంద్రాల్లో ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలని కోరారు.రాష్ట్రంలో అన్ని సంఘాలకు భవనాలు నిర్మించి ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారకులైన జర్నలిస్టుల ఆత్మగౌరవం కాపాడేలా ఈ భవనాలు నిర్మించి ఇవ్వాలన్నారు దీంతో పాటు అన్ని కార్పొరేటు ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా ఏమాత్రం ఖర్చు లేకుండా జర్నలిస్టు కుటుంబాల కు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. పోలీసుల నుండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీస్ భరోసా కార్డులు తోపాటు జర్నలిస్టు కుటుంబాలకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని యాదగిరి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైనా ఇంతవరకు జర్నలిస్టుల సమస్యలు పరిపూర్ణంగా పరిష్కారం కాలేదని ఎక్కడో ఒకచోట కొద్దిమందికి ఇండ్లు ఇంటి స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకునే ఆలోచన చేయొద్దని యాదగిరి అన్నారు.జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకుండా జాప్యం చేయొద్దని కోరారు ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు రాష్ట్ర ప్రచార కార్యదర్శి గట్టిగుండ్ల రాము కోదాడ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి కొండా ఉదయ్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :