సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : శ్రీ సత్య సాయి జిల్లా లో ఉన్న ఆయా గ్రామాల్లో రీ సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి. హెచ్. చేతన్ సర్వే అధికారులను ఆదేశించారు.మంగళ వారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం లోని స్పందన వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలో జరుగుతున్న రీసర్వే పనుల పురోగతి పై పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్ సర్వే శాఖ ఏడీ రామకృష్ణ, లతో కలిసి జిల్లాలోనితహసిల్దార్లు, డివిజన్ స్థాయి సర్వే అధికారులు ,విలేజ్ సర్వేయర్లు, వీఆర్వోలు, రీ సర్వే డిటిలు, సర్వే ఇన్స్పెక్టర్ తది తరులతో రీ సర్వే పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గడువు లోపు రీసెర్వె ప్రక్రియ పూర్తయ్యేలా సంబంధిత అధికారులు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని తెలిపారు ముఖ్యంగా మడకశిర, హిందూపురం ,పెనుగొండ సోమందేపల్లి, పరిగి, మండలాలకు సంబంధించిన రికార్డులు మరోసారి సరి చేసుకోవాలని సూచించారు. సర్వేలో డీఎల్ ఆర్ నమోదు, ఇందులో ఎదురయ్యే సమస్యలపై జాయింట్ కలెక్టర్ నివృత్తి చేశారు. ఒకే సర్వే నంబర్లలో ఇద్దరు పేర్లు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, భూమి హక్కు కలిగి ఉండి పాస్ పుస్తకం లేకపోతే చేపట్టవలసిన చర్యలు తదితర అంశాలపై తగు సూచనలు జారీ చేశారు. ఏదైనా కొలతలు వ్యత్యాసాలు ఉన్నప్పుడు మాత్రమే సంబంధిత భూ యాజమాన్యులకు వివాద రహిత భూ హక్కు యాజమాన్య పత్రాలు అందజేయడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మొదట ప్రభుత్వ నిబంధనలపై అవగాహన కలిగి నాణ్యత ప్రమాణాల తనిఖీ తో రీ సర్వే ప్రక్రియ ప్రారంభించాలని, ప్రతి గ్రామానికి సంబంధించిన రికార్డులు పక్కాగా ఉండాలని, వెబ్ లాండ్, డాక్యుమెంటేషన్, తదితర అంశాలపై దృష్టిని సారిo చాలన్నారు. ఈ సర్వేలో అంకితభావం ,చిత్తశుద్ధి, సమన్వయం ఎంతో అవరమన్నారు. ఆయా తసిల్డార్లు ఈ సర్వే పనులన్నీ స కాలంలో పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రౌండ్ ట్రూతింగ్, ఫైనల్ ఆర్వోఆర్, డ్రోన్ ఫ్లయింగ్, హద్దులను నాటే ప్రక్రియలను వేగవంతం చేయాలని సర్వే అధికారులను ఆదేశించారు. ఈ విషయం లో ఏలాంటి అపోహలు, సమస్య ఉన్నయెడల వాటిని గుర్తించి సత్వరమే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ చేతన్ తెలిపారు...
-----------------------
Admin