సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం ఏరియా ఐ ఎన్ టీ యు సి వైస్ ప్రెసిడెంట్ గా నూతనంగా ఎన్నుకోబడిన ఎండీ రజాక్ ను పీవీకే 5 గని లో ఐ ఎన్ టీ యు సి నాయకులు చిలక రాజయ్య ఆధ్వర్యంలో పూల బొకే,శాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమం లో పీవీకే 5 నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, సానుభూతి పరులు, రజాక్ కి కొత్తగూడెం ఏరియా ఐ ఎన్ టీ యు సి భాద్యతలు అప్పజెప్పినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణ, అంకితభావం గలవారని కొత్తగూడెం ఏరియా కార్మిక సమస్యల పై అవగాహన కలిగి, ట్రేడ్ యూనియన్ లో ఎంతో అనుభవం వున్న రజాక్ ని ఏరియా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక చేసిన ఐ ఎన్ టీ యు సి ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, రాష్ట్ర మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐ ఎన్ టీ యు సి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కి ధన్యవాదములు తెలియజేశారు. ఈ సందర్బంగా రజాక్ మాట్లాడుతూ కొత్తగూడెం ఏరియా కార్మికులకు ఏ సమస్య వచ్చిన వెంటనే స్పందించి పరిష్కరిస్తానని, ఐ ఎన్ టీ యు సి యూనియన్ బలోపేతానికి అందరు కలసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ సన్మాన కార్యక్రమం లో చిలక రాజయ్య, సకినాల సమ్మయ్య, ఏరియా స్టోర్ పిట్ భాద్యులు నటరాజ్, వల్లాల సాంబమూర్తి, సారయ్య, సబ్బాని సంపత్,రామ్మోహన్ రావు, కొమ్ము సాంబయ్య, ఈ.శ్రీనివాస్, ఎస్.రామస్వామి, బి.శంకర్, సవీర్, వేణుగోపాల్, రాజకుమార్, నాగరాజ్, డి.రమేష్, సమ్మయ్య, సందీప్, కుమారస్వామి, సామల సందీప్, పాసి, మధుసూదన్, పొన్నాల కృష్ణమూర్తి,శ్రీరాములు మేకల లక్ష్మణ్, రమాకాంత్, చిరంజీవి,గారె రమేష్, గంగరాజు, చిలికి రాజేష్, శంకర్, జాడిప్రసాద్, ఓం ప్రకాష్,చిన్నీ, నాగేశ్వరావు, సన్నీ,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin