Monday, 27 July 2026 02:35:15 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భార‌త్ జోడో యాత్ర‌ నేటికి ఏడాది... - టిపిసిసి సభ్యులు నాగ సీతారాములు

Date : 08 September 2023 04:43 AM Views : 346

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎంతటి మార్పులు తెచ్చిందో అందరికి తెలిసిందే. ఈ సందర్బంగా టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు తెలంగాణలో 13 రోజులు రాహుల్ గాంధీతో భారత్ జోడో యాత్రలో తెలంగాణ రాష్ట్రం మక్తల్ నుండి మహారాష్ట్ర లోని ఛత్రపతి శివాజి గుడి వరకు 385 కిలోమీటర్లు కలసి నడిచిన పాదయాత్రను, ఆ సమయంలో తనను కలిసిన ప్రజలతో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరును గుర్తు చేసుకున్నారు. దేశానికి కావాల్సింది ద్వేషం కాదు ప్రేమను పంచుదాం క‌న్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాద‌యాత్ర చేప‌ట్టి బిజెపి కేంద్ర సర్కార్ పై ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తు భావి భారత్ ప్రధాని, ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, ఎంపీ రాహుల్ గాంధీ గ‌త ఏడాది ఇదే రోజు సెప్టెంబ‌ర్ 7న భార‌త్ జోడో యాత్రకు త‌మిళ‌నాడు నుండి శ్రీ‌కారం చుట్టారు. ఈ యాత్రకు ఏడాది పూర్తయిన సందర్భంగా జోడో యాత్ర విశేషాల గురించి మాట్లాడుతు 145 రోజుల పాటు రాహూల్ చేప‌ట్టిన పాద‌యాత్ర సాగించి దేశరాజకీయాల్లో పెను మార్పులు వచ్చేలా చేసారన్నారు. ప్రతి రోజు ఆయన వెంట లక్షలాది మంది ఆయ‌న వెంట నడిచి బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై రాహుల్ చేపట్టిన యాత్రకు మద్దతుగా నిలిచారు. ఆయ‌న చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు రోజు రోజుకు భారీ ఎత్తున జ‌నం వ‌స్తుండ‌డం, అనూహ్య‌మైన రీతిలో ఆద‌ర‌ణ ల‌భించ‌డం జాతీయ మీడియా నే కాక అంతర్జాతీయ మీడియా కూడా ప్రముఖంగా చూపించిందన్నారు. మొత్తం 145 రోజుల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 4,081 కిలోమీటర్ల పాటు యాత్ర సాగిందన్న ఆయన రాబోయే రోజుల్లో చేపట్టనున్న 2 విడత యాత్రలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన కూడ ఉండేలా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క , తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ కోకన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు, డీసీసీ భద్రాద్రి కొత్తగూడెం అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ద్వారా పార్టీ అధిష్టానానికి, ఏఐసీసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తానన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :