Sunday, 26 July 2026 01:03:25 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలి... - టీయూడబ్ల్యూజే, ఐజేయు

Date : 28 July 2023 01:22 AM Views : 588

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : జర్నలిస్టులందరికీ ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్ ఇల్లు, అన్ని కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రులలో జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ అమలు చేయాలని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు దండు దతేందర్ డిమాండ్ చేశారు. గురువారం రెడ్ క్రాస్ భవనంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని పెద్ద సంఖ్యలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోస్ట్ కార్డుల ఉద్యమం నిర్వహించారు. ఈ సందర్భంగా దతేందర్ మాట్లాడుతూ తెలంగాణ సాధన ఉద్యమంలో జర్నలిస్టులు కీలక భూమిక పోషించారని, జర్నలిస్టు లేకపోతే తెలంగాణ ఉద్యమం తారస్థాయికి చేరేది కాదని అన్నారు. ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, డబల్ బెడ్రూం ఇల్లు, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ అమలయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారన్నారు. అయితే తెలంగాణ సాధించుకొని తొమ్మిదేళ్లు గడుస్తున్న ఇంతవరకు జర్నలిస్టులకు న్యాయం జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను పూర్తిగా విస్మరిచ్చిందని విమర్శించారు. తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏవి జర్నలిస్టులకు అమలు కాలేదు అన్నారు. హెల్త్ కార్డులు అమలు కాక అనేక మంది జర్నలిస్టులు అకాల మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .వెంటనే కార్పొరేట్ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించేలా జర్నలిస్టు హెల్త్ స్కీమ్ అమలయ్యేలా చూడాలని సూచించారు. కరువు జిల్లాగా ఉన్న పాలమూరులో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అద్దె ఇళ్లల్లో ఉంటూ అనేక ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమాజంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటున్న జర్నలిస్టులకే న్యాయం జరగకపోవడం శోచనీయమని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు టీయూడబ్ల్యూజే ఐజేయు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు శేఖర్ గౌడ్ మాట్లాడుతూ అరకొర జీతాలతో నిత్యం ప్రజల మధ్యన ఉంటూ వార్తల సేకరిస్తూ సమాజానికి సేవ చేస్తున్న జర్నలిస్టులను గుర్తించాలని కోరారు. జర్నలిస్టులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని ముఖ్యమంత్రి హామీలు ఇచ్చిన వాటినే కోరుతున్నారని అన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా న్యాయం చేయకపోతే ఆందోళనతీవ్రం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బీజీ రామాంజనేయులు ప్రచార కార్యదర్శి రాఘవ జనం సాక్షి బ్యూరో కాజా మైనుద్దీన్ వార్త తరంగాలు బ్యూరో శ్రీనివాసులు ఫోటోగ్రాఫర్లు రాజు గౌడ్, శ్రీనివాస్ ,రాజశేఖర్ హన్స్ ఇండియా వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :