సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ కల సాకారమైందని, ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ చెప్పారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని మొగిలిగిద్ద గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల విడుదల చేసిన ఆరు గ్యారెంటీ కార్డుల గురించి ప్రజలకు సవివరంగా ప్రచారం చేశారు. వీటిని కచ్చితంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఆకాంక్ష అని తెలిపారు. ఆరు గ్యారంటీలను ప్రకటిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతిస్తారా? అంటూ ఆయన ప్రజలను కోరగా అందరూ కాంగ్రెస్ వెంట ఉంటామని హామీ ఇచ్చారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే మహిళలకు మహాలక్షి పథకం కింద నెలకు రూ.2500, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పేద మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అమలుచేస్తామని ఆమె వెల్లడించారు. రైతు భరోసా కింద ఎకరాకు రైతుకు ఏడాదికి రూ.15 వేలు, కౌలు రైతుకూ ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, వరి పంటకు క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్, సామాన్యులకు 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ శంకర్ వివరించారు. తొమ్మిదేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. గ్రామంలో జయమ్మ అనే మహిళ ప్లాస్టిక్ సంచులతో ఆసరాగా చేసుకుని డ్రైనేజీ పక్కన త్రిపురమైన జీవితం గడుపుతుందని ఇలాంటివారిని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-----------------------
Admin