సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా “ఆధ్యాత్మిక దినోత్సవం” సందర్భంగా కేశంపేట మండల లోని పాటిగడ్డ చర్చ్ లో, పాపిరెడ్డి గూడెం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో, జహంగీర్ పీర్ దర్గాలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించిన జడ్పిటిసి దంపతులు తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషితో ప్రార్థనా మందిరాల్లో సంతరించుకున్న ఆధ్యాత్మిక శోభ. రాష్ట్రంలో ఉట్టిపడుతున్న ఆధ్మాత్మిక వైభవం, ప్రణాళికాబద్ధంగా ఆలయాల అభివృద్ధి. రాష్ట్ర పండుగగా బోనాల పండుగ, అధికారికంగా బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ పండుగ నిర్వహణ. కలలో ఊహించని విధంగా ఆ యాదాద్రి లక్ష్మీనరసింహుడి దివ్య ఆశీస్సులతో ముఖ్యమంత్రి కేసీఆర్ పునర్నిర్మించిన దివ్య క్షేత్రం యాదాద్రి ఆలయం. ఈ కార్యక్రమంలో దన్ రాజ్ రెడ్డి, గ్రామ పంచాయత్ సెక్రటరీ, శ్రీకాంత్, పూజారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin