సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : సత్తుపల్లి పట్టణంలో ధోబి ఘాట్ వద్ద వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో తెలంగాణ వీర వనిత, ధైర్య శాలి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య. చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సత్తుపల్లి పట్టణంలోని ధోభీ ఘాట్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసిపుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ ఆయన.. తెలంగాణ వీర వనిత శాలి చాకలి ఐలమ్మ. ఆనాడు నిరంకుశ నిజాం రజాకార్లను, దేశ్ ముఖ్ లను ఎదుర్కొన్నారని తెలిపారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి లను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఐలమ్మ స్ఫూర్తి తోనే సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించారని ఎమ్మెల్ సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin