సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్ 3లో వీపు రుద్దమని అరిచాడని భర్తపై భార్య దాడిచేసి గాయపరిచిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన శివయ్య, రజిత భార్యాభర్తలు. తమ ముగ్గురు పిల్లల చదువు కోసం వారు నగరానికి వచ్చి కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్ 3లో నివాసం ఉంటున్నారు. శివయ్య స్థానికంగా ఓ కంపెనీలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు, గతంలో వీరి మధ్య పలుమార్లు ఘర్షణలు జరిగి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. పెద్ద మనషులు సర్దిచెప్పడంతో కలిసి ఉంటున్నారు. గురువారం శివయ్య సాన్నం చేస్తూ వీపు రుద్దేందుకు భార్యను గట్టిగా పిలిచాడు. 'పెద్దగా అరుస్తున్నావ్ ఏంటి'అని రజిత ఇనుప రాడ్తో శివయ్య తలపై వెనుక నుంచి కొట్టింది. తలకు గాయం కావడంతో శివయ్యకు 6 కుట్లు పడ్డాయి. శివయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు...
-----------------------
Admin