సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నేడు 'బంద్ ఫర్ జస్టిస్' పేరిట బీసీ జేఏసీ రాష్ట్ర బంద్‌కు పిలుపు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నేడు బంద్. రిజర్వేషన్లపై కోర్టు స్టేతో బీసీల రాజకీయ ఎదుగుదలకు గండి పడిందని నిరసనగా బంద్ ప్రకటన. బీసీ బంద్ కారణంగా నేడు కాకతీయ విశ్వవిద్యాలయంలో పరీక్షలు వాయిదా. కేయూలో ఎల్ ఎల్ బీ, బీ.టెక్, ఎం.ఎస్సి, ఎం.టెక్ సహా పలు పరీక్షలు వాయిదా వేసినట్లు అధికారుల ప్రకటన. బీసీ బంద్‌తో ఎక్కడికక్కడే స్తంభించిన రవాణా వ్యవస్థ.. బస్సులు లేక ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు. వరంగల్ బస్ స్టాండ్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు.. బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలని డిమాండ్. బీసీ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వర్తక సంఘాలు.. మూతపడ్డ వాణిజ్య సముదాయాలు.
-----------------------
Reporter