సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేటలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోట శ్రీనివాస్ భార్య జ్యోతిని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి , మాజీ ఎంపీపీ తక్కళ్ళపెల్లి రవీందర్ రావు పరామర్శించారు. ఖానాపురం మండలం అశోక్ నగర్ కు చెందిన కోట శ్రీనివాస్ భార్య జ్యోతి ఇటివల ప్రయివేటు ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కొన్ని అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్న జ్యోతిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎల్థి శ్రీనివాస్ ,పోనుగోటి ప్రవీణ్ ,బుర్ర మురళి ,జాడి వెంకటేష్ , జాడి కిరణ్ ,గుగ్గిల నర్సింహాచారి తదితరులు పాల్గోన్నారు.
-----------------------
Reporter