సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి లో నకిలీ డాక్టర్ అరెస్ట్... ఫేక్ సర్టిఫికెట్లతో డాక్టర్ గా చలామణి మెడికల్ కౌన్సిల్ ఫిర్యాదుతో అలర్ట్ అయిన పోలీస్ యంత్రాంగం నకిలీ డాక్టర్లపై నిఘా డాక్టర్ పేరు మాదిరిగానే మరొకరు నకిలీ డాక్టర్ ఫేక్ సర్టిఫికెట్ సృష్టించుకుని డాక్టర్ గా చలమని అయ్యి చివరికి కటకటాల పాలు అయినా ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది ఆర్ఎంపీ వైద్యులు వద్ద చికిత్స వివరాలు తెలుసుకొని కామారెడ్డి తో పాటు పలు ప్రాంతాల్లో వైద్యుడిగా చలామణి అవుతున్న వ్యక్తి గుట్టురట్టు చేశారు కామరెడ్డి పోలీసులు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఫిర్యాదు మేరకు నకిలీ వైద్యుడిని గుర్తించి అరెస్టు చేశారు కామారెడ్డి ఏ ఎస్ పి చైతన్య రెడ్డి వెల్లడించారు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన ముల్కల రవీందర్ డిగ్రీ ఫెయిల్ అయ్యాడు అయితే డబ్బు సంపాదన లక్ష్యంగా ఆర్ఎంపి వైద్యుల వద్ద చికిత్స నేర్చుకున్నాడు తన పేరుని రవీందర్ రెడ్డిగా ఫోటో షాప్ లో ఆధార్ కార్డు నకిలీ సర్టిఫికెట్ తయారు చేసి ఫోటో మార్పు చేసుకున్నాడు ఫేక్ సర్టిఫికెట్ తో కామారెడ్డి స్టార్ హాస్పిటల్ లో ఆరోగ్య ఆసుపత్రి లింగంపేట భీమరాజు ఆసుపత్రిలో ఎంబిబిఎస్ ఎండి జనరల్ మెడిసిన్ పిల్లల వైద్యుడిగా కొనసాగాడు ఖానాపూర్ లోని షణ్ముఖ ఆసుపత్రిలో పిల్లల వైద్యుడిగా పని చేయడానికి ఈనెల 6వ అడ్వాన్స్గా రూపాయలు రెండు లక్షలు తీసుకున్నాడు అయితే రవీందర్ రెడ్డి అనే వ్యక్తి అసలు వైద్యుడే కాదని తెలంగాణ మెడికల్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు అతని పోలీసులు అరెస్టు చేశారు ఇతని వద్ద నుంచి ఫేక్ ఆధార్ కార్డు సర్టిఫికెట్లు మొబైల్ ఫోన్ లాప్టాప్ స్వాధీనం చేసుకున్నమని కోర్టులో హాజరు పరుస్తామని ఏఎస్పీ వెల్లడించారు ఈ సమావేశంలో కామరెడ్డి పట్టణ రూరల్ రూరల్ సీఐలు చంద్రశేఖర్ రెడ్డి రామన్ సి సి ఎస్ సి ఐ ఎస్ఐలు, శ్రీరామ్ రాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
-----------------------
Admin