సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : ఉట్కూరు మండలంలోని అవుసలోని పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ హత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారంలో బాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేసిన అభివృధి కార్యక్రమాలను మరియు రాబోయే తరాలకు కాంగ్రెస్ పార్టీ చేయబోయే అభివృధి సంక్షేమ పథకాల గురించి తెలియజెప్పుతూ ప్రతి గడపకు తిరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మక్తల్ నియోజకవర్గ నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు, పిసిసి అధికార ప్రతినిధి కేషం నాగరాజ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అవుసలోని పల్లి గ్రామానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గురించి ప్రజలందరికీ వివరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ గ్రామానికి 450 ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిందని, రైతన్నలకు ఉచిత విద్యుత్, లక్ష రూపాయల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ నే నని గుర్తుచేశారు. ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ యువ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin