Sunday, 26 July 2026 10:02:43 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డ్స్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయం

Date : 06 December 2025 10:34 PM Views : 268

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఘనంగా నిర్వహించారు. శనివారం పోలీస్ కమిషనరేట్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంగార్డ్స్ నిర్వహించిన పరేడ్ ఆహ్వనితులతో పాటుతో పాటు పోలీస్ అధికారులకు ఆకర్షణగా నిలిచింది. అనంతరం విధినిర్వహణలో రాణించిన హోంగార్డ్స్ కు వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల ప్రశంస పత్రాలను అందజేయడంతో పాటు, ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకోని అధికారులు నిర్వహించిన క్రీడల్లో రాణించిన హోంగార్డ్కు సీపీ బహుమతి ప్రధానం చేసారు. అనంతరం పోలీస్ కమిషనర్ హోంగార్డ్స్ లను ఉద్యేశిస్తూ మాట్లాడుతూ ముందుగా హోంగార్డ్స్ సిబ్బంది ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ,హోంగార్డ్స్ సిబ్బంది పోలీస్ శాఖకు అందిస్తున్న సేవలు అభినందనీయమని,మీ సేవలను మరువమని, ముఖ్యంగా హోంగార్డ్స్ సిబ్బంది పోలీస్ శాఖకు అందిస్తున్న సేవలకు తగ్గట్లుగానే హోంగార్డ్స్ సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చొరవ చూపిస్తోందని దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డ్స్ సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను అమలు చేయబడుతున్నాయని వీటిని ప్రతి ఒక్క హోంగార్డ్ సద్వినియోగం చేసుకోవాల్సి వుంటుందని ముఖ్యంగా ఏరాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణలో హోంగార్డ్ సిబ్బంది అత్యధిక గౌరవ వేతనం అందించడంతో పాటు, ట్రాఫిక్ పోలీసులతో సమానంగా ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహించే హోంగార్డ్స్ కు 30శాతం అదనపు వేతనం, పరేడ్ అలవెన్సు వంద రూపాయల నుండి రెండు వందల రూపాయలకు పెంచడం జరిగిందని,వీటితో పాటు ఉలెన్ జాకేట్లు,రెయిన్ కోట్లు అందించబడ్డాయని ప్రధానంగా హోంగార్డ్స్ ఉచిత వైద్య సదుపాయం కల్పనకోసం ప్రభుత్వం ఆలోచన చేస్తోందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు.ఈ కార్యక్రమములో డీసీపీలు అంకిత్ కుమార్,కవిత,అదనపు డీసీపీలు రవి,సురేష్ కుమార్,శ్రీనివాస్,ప్రభాకర్ తో పాటు ఏసిపిలు,ఆర్.ఐలు,ఇన్స్స్పెక్టర్లు,ఆర్.ఎస్.ఐలు,ఇతర పోలీస్ సిబ్బంది,హోంగార్డ్స్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :