సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మఖ్తల్ : సీఎం రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదు చేయాలని మఖ్తల్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు ఎ.రవి కుమార్ ఆధ్వర్యంలో మఖ్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డికి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోటుపాట్లపై ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేయగా... చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని మఖ్తల్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండింస్తోందని టౌన్ అధ్యక్షుడు రవి కుమార్ తెలిపారు. బాల్కసుమన్ పై కేసు నమోదు చేయాలని కోరారు. ఫిర్యాదు అందించిన వారిలో నేతలు వల్లంపల్లి లక్ష్మణ్, వాకిటి శ్యామ్, బోయ వెంకటేష్, ఫయాజ్, అసముద్దీన్, అబ్దుల్ రెహమాన్, నాగేష్, రఘు, సురేందర్ గౌడ్, మంజూరు ఇలాహి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin