Sunday, 26 July 2026 09:52:40 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పంట నష్టంపై సమగ్ర సర్వే చేపట్టాలి... - సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా

Date : 06 December 2023 02:49 AM Views : 291

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటలపై సమగ్ర సర్వే నిర్వహించి జరిగిన నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా జిల్లా కలెక్టరును కోరారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో ఆమెను కలిసి వినతిపత్రాన్ని అందించి సమస్యను వివరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి, వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు నష్టపోయారన్నారు. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అప్పులు చేసి పంటలు సాగు చేసిన గిరిజన, గిరిజనేతర పేద రైతులు గుండె నిబ్బరం కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసి జరిగిన నష్టంపై సర్వే చేపట్టి తగు నివేదికని ప్రభుత్వానికి అందించడం ద్వారా నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చొరవ తీసుకోవాలని కలెక్టరును కోరినట్లు సాబీర్ పాషా తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :