సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ మున్సిపల్ లో భాగ్యనగర్ కలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాల ఆవరణలో సెప్టెంబర్ 14న హిందీ దివస్ ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థుల విద్యార్థులకు హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను పై గురించి వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రఫత్ సుల్తాన మాట్లాడుతూ.. హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను ఉపయోగాన్ని పాఠశాల విద్యార్థులకు ఎంతో చక్కగా వివరించారు. హిందీ భాష నేర్చుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను భాష వల్ల కలిగే లాభాలను వివరించారు. వారు హిందీ భాష యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ భారతదేశం వివిధ సంస్కృతులకు, విభిన్న భాషలకు, విభిన్నమైన నాగరికతలకు నెలవు దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక ప్రాంతీయ భాష ఉంది. అంతేకాదు ఒకే రాష్ట్రంలో కొన్ని గిరిజన ప్రాంతాలకు వెళితే అక్కడి వారి భాష మరొకలా ఉంటుంది. ఆయా వర్గాల వారు మరొకరితో మాట్లాడుకునేందుకే అనుసంధానంగా వ్యవహరించేందే భాష. ఈ భాష ద్వారానే మరొక వ్యక్తికి మనం చెప్పాలనుకునేది చేరుతుంది అని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల హిందీ అధ్యాపకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
-----------------------
Admin