Monday, 27 July 2026 07:41:06 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మొగిలిగిద్దలో టిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం...

Date : 31 October 2023 04:21 AM Views : 210

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : బీఆర్ఎస్ పార్టీ వైపే యువత పెద్ద ఎత్తున వస్తున్నారని గ్రామాలకు గ్రామాలు అంజన్న నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నాయని షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల మొగిలిగిద్ద గ్రామ యువ నాయకుడు గుట్ట రాజు అన్నారు. సోమవారం మొగిలిగిద్ద గ్రామంలో స్థానిక నాయకుడు గుట్ట రాజు ఏర్పాటుచేసిన ఎన్నికల కార్యాలయాన్ని ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే అంజయ్య మాట్లాడుతూ.. నియోజక వర్గంలో యువత టిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ప్రతిపాదిస్తూ, గ్రామ గ్రామాన కార్యకర్తలు పెద్ద ఎత్తున కలిసి వస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఇది ఎంతో శుభ పరిణామం అని అన్నారు. నాయకులు మారుతున్నా కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీకి సమకూరుతున్నారని అన్నారు. మొగిలిగిద్దలో టిఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని నిరూపిస్తున్న గ్రామ యువతకు మండల శ్రేణులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు జరిగే వరకూ గ్రామాన్ని పటిష్ట పరిచి పార్టీకి లాభం చేకూర్చాలని ఎన్నికల్లో గెలుపొందాక మొగలిగిద్ద గ్రామానికి ఏం చేయాలో కార్యకర్తల ప్రజల అభీష్టం మేరకు సమస్యలు నెరవేర్చుతానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మోహమ్మద్ సిరాజ్, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :