సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తిలో సోమవారం జరగనున్న పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి జిల్లాలో ఏర్పాటు చేసిన 86 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్, వీడియోగ్రఫీ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ పరిశీలించారు. ఆదివారం పుట్టపర్తి లోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్, వీడియోగ్రఫీ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్, వీడియోగ్రఫీ తీసేందుకు కెమెరాలు సరైన స్థలంలో ఏర్పాటు చేశారా లేదా అనేది పరిశీలించి, వెబ్ క్యాస్టింగ్, వీడియోగ్రఫీ సరిగా కనిపించని చోట సరైన స్థలంలో ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండి పోలింగ్ సరళిని వెబ్ క్యాస్టింగ్, వీడియోగ్రఫీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు...
-----------------------
Admin