సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని నిన్న పార్లమెంట్లో అవమానపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే భర్త రఫ్ చేయాలని మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు కోరారు. భారత రాజ్యాంగాన్ని మోడీ ప్రభుత్వం మారుస్తానికే అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడారని ,భారత రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడి రాజ్యా పదవులు అనుభవిస్తూ రాజ్యాధికారాన్ని చేతుల్లో పెట్టుకొని రాజ్యాధికారాన్ని రాసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని అవహేళన చేసి మాట్లాడటం బిజెపి ప్రభుత్వం దళితుల పట్ల బిఆర్ అంబేద్కర్ గారి పట్ల వారికున్న దురుద్దేశం బయటపడిందని తెలిపారు, అమిత్ షా వెంటనే పేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు, ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు జంగిలి లింగ యాదవ్ ఐఎన్టిసి పట్టణ అధ్యక్షులు చాంద్ పాషా ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు సురేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin