సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ మండలంలోని రాఘవపురం గ్రామంలో కొలువై ఉన్న అంకమ్మ తల్లి జాతర చివరి రోజు జరుగుతున్న ముగింపు వేడుకల్లో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు. రెండేళ్లకు ఒకసారి జరిగే వేడుకల్లో భాగంగా జరిగిన ప్రత్యేక పూజకార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అంకమ్మ తల్లి చల్లని దీవెనలతో నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్ధించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుజాత నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, సుజాతనగర్ మండల కిసాన్ కాంగ్రెస్ అద్యక్షుడు లోసెట్టి.నాగార్జున, మండల SC సెల్ అధ్యక్షులు గుండేటి.వెంకటరాములు, మండల ST సెల్ నాయకులు గరిక.జయరాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిమట.చంద్రయ్య,బాలు. నాగేశ్వరావు, బాలు.సత్యనారాయణ, యువజన కాంగ్రెస్ నాయకులు తెల్ల బోయిన.కవిన్, గణేష్,నరేష్ మరియ గ్రామస్థులు పాల్గొన్నారు
-----------------------
Admin