సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : మండలంలోని బోత్తలపాలెం గ్రామంలో అంగన్వాడి కేంద్రాలు 1. 2, తల్లుల కమిటీ సమావేశం లో స్థానిక సర్పంచ్ భోగాల వీరారెడ్డి పాల్గొని మాట్లాడుతూ కేంద్రాల పనితీరును అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు బాధితులకు పిల్లలకు పౌష్టికాహారం గుడ్లు బాలామృతం అందుతున్నాయా? భోజనాలు మంచిగా ప్రభుత్వ మెనూ ప్రకారం పెడుతున్నారా అని ఆయన తల్లులను ప్రశ్నించారు దీనికి సమాధానంగా తల్లులు ప్రతినెల 16 కోడిగుడ్లు బాలామృతం ఒక ప్యాకెట్ అందిస్తున్నారని వారు తెలిపారు అదేవిధంగా బాలింతలకు కేంద్రాల్లో ప్రతిరోజు ఏ వారం ఏది వండుతున్నారని ఆయన ప్రశ్నించగా మెనూ ప్రకారం గుడ్డు కూర ఆకుకూర పప్పు సాంబారు వండి పెట్టుచున్నారని తల్లులు తెలిపారు. అదేవిధంగా గర్భిణీలను బాలింతల కు ప్రతి నెల మొదటి శనివారం వ్యాక్సినేషన్ చేస్తున్నారని ప్రతిరోజు బరువులు తూస్తున్నారని తెలిపారు. సర్పంచ్ స్పందిస్తూ అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ అంగన్వాడీ టీచర్లను అభినందించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలు బాలింతలు పిల్లలు అందుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించి అంగన్వాడీ కేంద్రాలను బలోపితం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉప్పెల్లి బాబు, గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యులు కందగట్ల భానుమతి, అంగన్వాడీ టీచర్లు దేవరకొండ జానకమ్మ ,సింగిరి కొండ ప్రేమలత, ఆశా వర్కర్లు పిన్నెల్లి జ్యోతి, ఊటుకూరి నాగ సుకన్య,తల్లులు గర్భిణులు రమ్య, భవాని ,నాగలక్ష్మి, నాగమణి, అఖిల, మహేశ్వరి వెంకమ్మ, వీరమ్మ, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin