సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / మన ప్రాణాలకు రక్తం అవసరం ఎంతఅవసరమో అందరికీ తెలిసిందే అనీ ఇలాంటి రక్తం కొందరిలో తక్కువగా ఉంటుందని కొందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని అలాంటి సంపూర్ణ ఆరోగ్యవంతుల రక్తం అనారోగ్యంతో బాధపడుతున్న వారి ప్రాణాలు నిలబెట్టేందుకు ఉపయోగపడుతుందని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ లయన్ నటరాజ్ తెలిపారు. ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం రాయికల్ టోల్ ప్లాజా వద్ద లయన్స్ క్లబ్ షాద్ నగర్ ఆధ్వర్యంలో సిబ్బంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి లయన్ సాదక్ అలీ ఇబ్రహీం ఎంవీఎస్ రంగయ్య రమాదేవి కమ్మదనం సందీప్ అశ్విన్ పటేల్ శివ నాగయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రక్తదానం చేయండి-ప్రాణాలను నిలబెట్టండి అనే నినాదాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రాచుర్యంలోకి తెచ్చిందనీ, రక్తందానం చేసే ప్రాణదాతలకు గుర్తింపుగా ఏటా జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహిస్తారని రక్తదానం చేసేందుకు ప్రజల్ని చైతన్యపరచడంతోపాటు రక్తదానం చేసే విషయంలో ప్రజలకు సరైన అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అని ఆన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన పలువురికి రమాదేవి పండ్లు పంపిణీ చేశారు.
-----------------------
Admin