సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : షాద్ నగర్ : నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా నూతనంగా నియమించిన జిల్లా కమిటీలో షాద్ నగర్ పట్టణానికి చెందిన నలుగురు ఎన్ ఎస్ యు ఐ సభ్యులను రంగారెడ్డి జిల్లా సెక్రటేరీలుగా నియమిస్తూ రాష్ర్ట అధ్యక్షులు అయిన వెంకట్ బల్మూర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలి, రేపటి మార్గదర్శకులు నేటి యువత, రాబోయే కాలంలో ఇలాంటి మరెందరో నాయకులు ముందుకి రావాలని, విద్యార్థుల కోసం మరిన్ని కార్యక్రమాలు చేయాలని అభినందించారు. ఈ సందర్భంగా నూతన సెక్రెటరీలు మాట్లాడుతూ.. తమపై నమ్మకం ఉంచి ఈ పదవిని ఇచ్చిన ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బాల్మూర్, ఎన్ ఎస్ యు ఐ జాతీయ కన్వీనర్ దినేష్ సాగర్ కి, ఎన్ ఎస్ యు ఐ అసెంబ్లీ అధ్యక్షులు జిజో జాన్సన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
-----------------------
Admin