సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి గ్రామానికి చెందిన కవి గాయకుడు వృత్తిరీత్యా తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణ సంస్థలో కండక్టర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ కు పుడమి రత్న విశిష్ట పురష్కారం అందుకున్నారు. ఇట్టి అవార్డ్ ను ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమి చైర్మన్ శ్రీమతి నందమూరి లక్ష్మీపార్వతి అందజేశారు. నల్గొండలో ఫించన్ దారుల అసోసియేషన్ బిల్డింగ్ లో పుడమి సాహితి వేదిక నల్గొండ 5 వ వార్షికోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి వివిధ రంగాలలో రాణిస్తున్న వారిని గుర్తించి పురష్కారాలు అందజేశారు. శ్రీనివాస్ పాటలు రాయడం పాడటం మరియు కళాకారునిగా సమాజాన్ని చైతన్యవంతం చేసే అనేకసార్లు కళారూపాలు ప్రదర్శించి చైతన్యం చేసినందుకు కళారంగం లో ఈ పురష్కారం అందజేసినారని శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కళారంగంలో పాటలు పాడే గాయకులను ప్రోత్సహించేదుకు త్వరలో ఒక కార్యక్రమం చేయనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా తోటి ఉధ్యోగులు స్నేహితులు బంధువులు మఠంపల్లి గ్రామస్తులు శ్రీనివాస్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పుడమి సాహితి వేదిక జాతీయ అధ్యక్షులు చిలుముల బాలరెడ్డి, గుత్తా మోహన్ రెడ్డి మాజీ మంత్రివర్యులు కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క రాజకీయ నాయకురాలు పుడమి సాహితి వేదిక నిర్వాహకులు పాల్గొన్నారు.
-----------------------
Admin