సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చుంచుపల్లి : చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీ పంచాయతీలో స్థానిక ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగగా టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాల్ రావ్, ఆళ్ల మురళి,తూము.చౌదరి పాదయాత్ర చేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ ఈ నెల 17న తెలంగాణ రాష్టానికి తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియగాంధీ వస్తున్నారు. ఖమ్మం, చేవెళ్ల సభల వలే తలదన్నెలా, విజయబేరి సభకు కూడా నియోజకవర్గం నుండి వేల సంఖ్యలో తరలి వెళ్లి విజయబేరి సభను విజయవంతం చేద్దామని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేద ప్రజల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు, దళిత ప్రజలకు ఇంటి నిర్మాణానికి స్థలంలో పాటు ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణ మాఫీ, 500 రూపాయలకే వంట గ్యాస్. అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ గడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర సాగించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు రాకుండా ప్రజలకు సేవ చేస్తామని ఆన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కుంచం వెంకటేష్, ఖలీల్, యాదగిరి, ఖయ్యూం, ఏలేటి వెంకటేశ్వర్లు, బలరాం, పల్లి వేణు, వీరస్వామి వెంకట్రావు, భావ్ సింగ్, కుంచం ప్రమీల, మైనారిటీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ .కరీంపాషా, పూనెం శ్రీనివాస్, మైనార్టీ నాయకులు గౌస్ భాయ్, అయూబ్ ఖాన్, తాండ్ర నాగబాబు, సుందర్లాల్ కోరి, చిమట నాగేశ్వరరావు, కనకరాజు, నాగరాజు, ఓదెలు, శేఖర్, సతీష్, పండు, నిరంజన్ రెడ్డి, నరసింహారెడ్డి, భద్రం, రవి, నరేష్, శ్రీకుమార్, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, పార్టీ అభిమానులు, యువకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin