సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ, మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ గోశాల లో గోవులను సేవా కార్యక్రమం నిర్వహించడమైఅయినది... బిజెపి పట్టణ అధ్యక్షులు జస్సుఅనిల్ కుమార్ మాట్లాడుతూ నేటి యువత పెడ ధోరణిని అవలంబిస్తూ, పాచ్చత్య సంస్కృతిని అనుకరిస్తూ మద్యానికి బానిసలై, మత్తుకు అలవాటు పడి భారతీయ సంస్కృతి సంప్రదాయ మూలలను మరిచి నేడు ప్రపంచ ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం చాలా విడ్డూరంగా ఉందని. నేటి యువత భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మూలాలను ఎరికి భారతదేశ వ్యవసాయ ఆధారిత దేశం ఈ వ్యవసాయానికి మూలం కోసం ప్రేమించడం గో సేవ చేసుకోవడం వందేమాతరం అంటూ నినాదిస్తూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పట్టించినప్పుడే, భారతదేశం భారతీయ సంస్కృతి నిలబడి నిలదొక్కుకుంటుదని. హృదయాలు చరిత్ర పుటాలేనే మిగిలిపోతుందని కావున నేటి యువత భవిష్యత్తు తరాల కోసం భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం కోసం భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకుని పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యామాద్రి భాస్కర్ బిజెపి సీనియర్ నాయకులు మీసాల రాజేశ్వర్ కృష్ణ గౌడ్ దళిత మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పులి యుగంధర్ బీజేవైఎం ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్ ఉపాధ్యాయులు సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin