సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తాం. ఇల్లు రాలేదన్న మాట ఎక్కడా వినపడకూడదు. వెంకటాపురం పంచాయతీలో ఇంటింటికి తిరిగి లబ్ధిదారులను గుర్తించిన ఎంపీడీవో పోలప్ప. సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండల పరిధిలోని వెంకటాపురం పంచాయతీలో ఇంటింటికి తిరిగి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తుందని మండల అభివృద్ధి అధికారి పోలప్ప ప్రజలకు తెలియజేశారు గతంలో ప్రభుత్వం నుండి ఇల్లు రాని వారందరికీ ఇప్పుడు మంజూరు చేసి ఇల్లు కట్టుకోవచ్చు అన్నారు కావున మండల వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులందరూ దీనిపై ప్రత్యేక దృష్టి ఉంచి తొందరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు నల్లగుట్లపల్లి వీర ఓబునపల్లి తదితర గ్రామాల్లో ఇంటింటికి తిరిగి అర్హతలు ఉన్న లబ్ధిదారులను గుర్తించారు. సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మూడు రోజుల లోపల అర్హత ఉన్నలబ్ధిదారుల లిస్టు పూర్తి చేయాలన్నారు ఇల్లు నిర్మాణాలపై ఎవరికైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు గ్రామాల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఇల్లు లేదని చెప్పకూడదని అలా ఎవరైనా చెప్పితే వాలంటీర్లపై చర్య తీసుకుంటామని వాలంటీర్లను హెచ్చరించారు. వాలంటీర్లు సచివాల సిబ్బంది సమన్వయం చేసుకొని లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు....
-----------------------
Admin