Sunday, 26 July 2026 08:08:09 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం హామీ...

Date : 03 November 2022 12:08 AM Views : 1923

సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : ▪️హంద్రీనీవా 33,34 ప్యాకేజీ భూ సేకరణ పెండింగ్ నిధులు విడుదలకు అంగీకారం ▪️అటవీ భూములు సాగు చేసుకుంటున్న వారికి శాశ్వత పట్టాలు ▪️వివిధ రోడ్ల నిర్మాణానికి 15 కోట్లు అడిగా ▪️పిఎబిఆర్ లింక్ ఛానల్ ఆధునికీకరణ ఒకే చెప్పారు ▪️త్రాగునీటి సమస్య పరిష్కారానికి 10 కోట్లు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ▪️కోర్టులో పెండింగులో ఉన్నవారికి ప్రత్యామ్నాయ స్థలాలు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గం అభివృద్ధి కి అండగా నిలుస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. * స్థానిక వైస్సార్సీపి కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశామని చెప్పారు.ఈ సందర్భంగా జరిగిన సుదీర్ఘ చర్చల్లో నియోజకవర్గానికి సంబంధించిన వివిధ సమస్యలను దృష్టికి తీసుకెళ్ళినట్లు వెల్లడించారు.వాటిలో ప్రధానంగా హంద్రీనీవా 33,34 ప్యాకేజిలలో భూములు సేకరణ పూర్తి చేయడానికి పెండింగ్ లో ఉన్న 6 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరానన్నారు.ఇది పూర్తి అయితే దాదాపు 40 వేల ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు.నియోజకవర్గంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూములకు సాగు హక్కు పట్టాలు విషయమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని వెంటనే పట్టాలు మంజూరు చేయాలని ఆయన ఆదేశించారని తెలిపారు. ఎవరైతే అటవీ భూములు సాగు చేస్తున్నారో వారికి త్వరలో శాశ్వత భూ హక్కులు కల్పిస్తామని చెప్పారు.అదే విదంగా ఉరవకొండ కనేకల్ క్రాస్ నుంచి పట్టణం మీదుగా గుంతకల్లు రోడ్డు ,ఉరవకొండ-హావలిగి,ఉరవకొండ-కళ్యాణదుర్గం రోడ్ల నిర్మాణానికి 15 కోట్లరూపాయలు నిధులు విడుదల చేయాలని కోరినట్లు అందుకు సీఎం సానుకూలంగా స్పందించారన్నారు.మరో ప్రధాన సమస్య త్రాగునీటి ఇబ్బందులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళానని ఇందుకోసం రూ. 10 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.వీటితో పాటు మరో ముఖ్యమైన హెచ్ఎల్సి నుంచి పిఎబిఆర్ లింక్ ఛానల్ ఆధునికీకరణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖ కు ఆదేశాలు జారీ చేశారన్నారు.రాకెట్ల-ఆమిద్యాల లిఫ్ట్ ,రాగులపాడు నుంచి గుంతకల్లు వరకు హంద్రీనీవా పై నిర్మించే డిస్ట్రిబ్యూటరీలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారంగా 12 నుంచి 15 లక్షల వరకు ఇవ్వాలని అడగగా ఇందుకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించారని చెప్పారు. కోర్టులో పెండింగ్లో ఉన్న పట్టణంలోని 570 మంది పేదలకు ఇళ్ళ పట్టాల విషయమై ఆడిగానని వారికి ప్రత్యామ్నాయ స్థలాలు ఇచ్చేందుకు అంగీకరించారన్నారు.ఇవే కాక నియోజకవర్గంలో పెండింగులో ఉన్న 5 వేల మంది ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారన్నారు.హంద్రీనీవా నుంచి బెలుగుప్ప చెరువుకు నీరిచ్చేందుకు ఒప్పుకున్నారని ఇంకా బెలుగుప్ప మండలంలోని శ్రీరంగపురం, బ్రాహ్మణపల్లి, గంగవరం, కోనాపురం, కాలువపల్లి చెరువులకు నీరు ఇవ్వాలని కోరానన్నారు.తాను ముఖ్యమంత్రితో భేటీ అయిన సందర్భంలో అనేక అంశాలపై సానుకూలంగా స్పందించారని ప్రతిపాదనలు పరిశీలించాలని అధికారులను ఆదేశించారని తెలిపారు.రాబోయే ఏడాది లోపు నియోజకవర్గంలోని సమస్యలన్ని పరిష్కారం అవుతాయని విశ్వేశ్వరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :