సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థిని ఫస్ట్ స్టేట్ లెవెల్ కుంఫు అండ్ కరాటే ఛాంపియన్షిప్ 2023 న్యూ టైగర్స్ కుంఫు అండ్ కరాటే స్పోర్ట్స్ అకాడమీఆధ్వర్యంలో జీడిమెట్లలో జరిగిన కుంఫు ఛాంపియన్షిప్ లో భవానీ ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ వీరాచారి చేతుల మీదుగాసర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ వీరాచారి మాట్లాడుతూ.. విద్యార్థిని విద్యార్థులకు ఆత్మరక్షణకై శారీరక, మానసిక ఉల్లాసానికి కుంగ్ ఫు ఎంతో దోహదపడుతుందని ప్రతి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఇలాంటి విద్యలను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ అహ్మద్ మాస్టర్, వెంకటేష్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
-----------------------
Admin